శ్రీకాకుళం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు దివంగత హనుమంతు అప్పయ్యదొర 90వ జయంతిని పురస్కరించుకుని అంజలి ఘటించారు. శనివారం పలాస వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిష్ఠు గోపి, పలాస ఎంపీపీ ప్రతినిధి ఉంగ సాయి కృష్ణ, జిల్లా సెక్రటరీ బడగల బాలచంద్రుడు, బమ్మిడి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa