కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్ మరో బంతి మిగిలి ఉండగానే 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ మరో 5 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడుగా శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ లను ఆడారు. దీంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో 308 పరుగులు చేసి విజయం సాధించింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. భారత బౌలింగ్ సమయంలో రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలిర్ హర్షిత్ రాణాపై అరవడం కనిపించింది. మైండ్ దొబ్బిందా అంటూ హిందీలో హర్షిత్ పై ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నింగ్స్ 32వ ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. హర్షిత్ రాణా కారణంగా ఆ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టుకు 4 పరుగులు అదనంగా వచ్చాయి. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా చేసిన పొరపాటుతో ఇంగ్లాండ్ జట్టుకు పరుగులు రావడంతో రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. హర్షిత్ ను చూస్తూ దిమాక్ లేదా.. అంటూ ఫైర్ అయ్యాడు. 32వ ఓవర్లో జోస్ బట్లర్‌కు హర్షిత్ రాణా బౌలింగ్ వేస్తున్నాడు. ఆ ఓవర్‌లోని ఐదవ బంతిని బట్లర్ డిఫెండ్ చేశాడు. దీని తర్వాత, హర్షిత్ రాణా బంతిని అందుకుని అనవసరంగా స్టంప్స్‌పైకి విసిరాడు. రాణా వేసిన ఈ త్రో స్టంప్స్‌ను తాకకుండా బంతి బౌండరీ వైపు వెళ్లింది. దీంతో ఓవర్ త్రో ద్వారా ఇంగ్లాండ్ కు 4 పరుగులు వచ్చాయి. అనవసరంగా ఇంగ్లాండ్ కు హర్షిత్ రాణా త్రో ద్వారా నాలుగు పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు. ఈ మిస్టేక్ చేసినందుకు రోహిత్ శర్మ హర్షిత్ రాణాను మందలించాడు. హర్షిత్ చేసిన పనికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తిగా కనిపించాడు. స్టంప్ మైక్‌లో రోహిత్ శర్మ 'నీ మెదడు ఎక్కడ ఉంది' అని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత హిట్‌మ్యాన్ హర్షిత్‌ను అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Captain rohit sharma was abusing indian player harshit rana but harshit rana ignored him pic.twitter.com/QrueIufCyy
— . (@whyrattkuhli) February 9, 2025
![]() |
![]() |