అల్లనేరేడు మొక్కల మధ్య దూరం 24 అడుగులు ఉండేలా నాటుకోవాలి. నాట్లకు గుంతలను 1×1×1 మీటరు సైజులో తవ్వుకొని ప్రతి గుంతకు 25-30 కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి. చెట్లను నాటుటకు ఆగస్టు-సెప్టెంబరు నెలలు అనువైనవి. ఎకరా పొలంలో నాటుటకు 80 మొక్కలు అవసరమవుతాయి. చిన్న, సన్నకారు రైతులు స్థలం, వనరుల అందుబాటును బట్టి 5-10 చెట్లు కూడా పెంచుకొని ఆదాయాన్ని పొందవచ్చు.
![]() |
![]() |