పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన కుడి కాలువ కనెక్టివిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి కుడి కాల్వకు నీటిని పంపిణీ చేయడానికి కుడి కాల్వ జంటగుహల విస్తరణ పనులను జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇప్పటికే తోటగొంది మామిడిగొంది, మామిడిగొంది దేవరగొంది జంటగుహలలో డీవాటరింగ్ పనులు పూర్తిచేశారు. తోటగొంది మామిడిగొంది జంటగుహలలో కుడివైపు గుహ విస్తరణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి.
ప్రాజెక్టు ఎగ్జిట్ చానల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద 0.2 టీఎంసీల నీటి నిల్వ చేయనున్న రిజర్వాయర్ బండ్ పనులు పూర్తి చేశారు. బండ్-2 పనులు పూర్తిచేసి దాని పటిష్టతకు రాళ్లు వేసి కాంక్రీటు పనులు పూర్తి చేశారు. బండ్-1 పనుల ప్రాంతంలో కంకరు రాళ్లు వేసి బండ్‌కి రక్షణ చర్యలు చేపడుతున్నారు. పనులు వేగంగా జరిగేందుకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి రేయింబవళ్లు శ్రమిస్తున్నట్టు ఈఈ బాలకృష్ణ తెలిపారు.
![]() |
![]() |