మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సాక్షిగా పరిగణించడంపై హైకోర్టులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని 2024 జులై 25న సీబీఐ సాక్షిగా పెట్టింది. దస్తగిరిని సీబీఐ సాక్షిగా పరిగణించడంతో అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించింది. ప్రతివాదులుగా సీబీఐకి, దస్తగిరికి నోటీసులు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ4 దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత ఈ కేసులో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దస్తగిరి అప్రూవర్‌గా మారి ఆ కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ ముందు వెల్లడించడంతో ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర బట్టబయలైంది. ఒక పథకం ప్రకారమే హత్యకు పాల్పడ్డారని ముఖ్యంగా దస్తగిరికి డబ్బు ఆశ చూపడం.. దస్తగిరి, గంగిరెడ్డి మాట్లాడిని కొన్ని ఆడియోలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సమయంలో దస్తగిరి అప్రూవర్‌గా మారి హత్యకు సంబంధించిన అంశాలను సీబీఐకి చెప్పారు.తాను అప్రూవర్‌గా మారాను కాబట్టి తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది జూలై నెలలో సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు. దస్తగిరి వాదనలు విన్న సీబీఐ కోర్టు.. దస్తగిరిని ఈకేసులో నిందితుడిగా కాకుండా సాక్షిగా పరిగణిస్తున్నామంటూ స్పష్టం చేసింది. అయితే సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా చేస్తూ సీబీఐ కోర్టు పరిగణించడాన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు ఇచ్చింది. ఈనెల 27కు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, దస్తగిరి కౌంటర్ చేయాల్సి ఉంటుంది.
![]() |
![]() |