పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైసీపీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శించారు. పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
పోలీసులకు సిగ్గుండాలని, పరిటాల కుటుంబానికి పోలీసులు గుమస్తాలు, వాచ్‌మెన్‌లు కాదని విమర్శించారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వర్గీయులే వైసీపీ కార్యకర్తపై దాడి చేయించారన్నారు.
![]() |
![]() |