కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జన్మోహన్ రెడ్డి తాను పూర్తిగా మారిపోయానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి వచ్చే జగన్ 2.0 వేరుగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తల కోసం తాను ఏం చేస్తానో చూపిస్తానని అన్నారు. గతంలో పార్టీ శ్రేణులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని... జగన్ 1.0లో కార్యకర్తలకు గొప్పగా ఏం చేయలేకపోయానని తెలిపారు. జగన్ 2.0పై జనసేన నేత సామినేని ఉదయభాను మాట్లాడారు. జగన్ 2.0 వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్వర్యంలో ఈనెల16న జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు వస్తారని చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ(సోమవారం) జనసేన నేతలు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, అక్కల గాంధీ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఈనెల 16వ తేదీన సమావేశంలో పాల్గొంటారన్నారు. నాగబాబు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు ఈ సమావేశానికి అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
![]() |
![]() |