దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఈ క్రమంలో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311కి పడిపోయింది. నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 23,381 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ బ్యాంక్ (1.20%), భారతి ఎయిర్ టెల్ (0.90%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.48%), టెక్ మహీంద్రా (0.41%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.40%).
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.45%), టాటా స్టీల్ (-3.11%), జొమాటో (-2.87%), టైటాన్ (-2.83%), బజాజ్ ఫైనాన్స్ (-2.15%).
![]() |
![]() |