మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్‌రెడ్డి లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.
![]() |
![]() |