నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు సాయంత్రంతో నామినేషన్ల దాఖల గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను మంగళవారం పరిశీలించనున్నారు.అయితే ఈ నామినేషన్లు ఉప సంహరించుకోనే గడువు 13వ తేదీతో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను మార్చి 8వ తేదీలోగా పూర్తి చేస్తారు.తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు గడువు నేటితో ముగియనుంది.
![]() |
![]() |