స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలతో ముగిసింది. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 548.39 పాయింట్లు పడిపోయి 77,311.80 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 178.35 పాయింట్లు తగ్గి 23,381.60 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 1138 పాయింట్లు దిగజారింది.ఈ క్రమంలో సెన్సెక్స్‌లో నష్టపోయిన షేర్లలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ షేర్లు కొన్ని ప్రారంభ లాభాలను నమోదు చేశాయి. దీంతో పలువురు మదుపర్లు పెద్ద ఎత్తున నష్టపోగా, మరికొంత మంది మాత్రం లాభపడ్డారు. ఇది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల క్షీణించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.సోమవారం రోజున ట్రంప్ తన ప్రకటనలో మాట్లాడుతూ వచ్చే సోమవారం లేదా మంగళవారం నాటికి అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కొత్త సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో అమెరికా అంతర్జాతీయ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో మార్కెట్లు మరింత దిగజారాయి. గత వారం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య యుద్ధానికి సంబంధించిన కొత్త సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది.
![]() |
![]() |