బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ.88,500 పలికి సరికొత్త రికార్డును అందుకుంది. క్రితం వారం 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.86,070 వద్ద ఉండగా, ఈరోజు రూ.2,430 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది.డాలర్ మారకంతో రూపాయి క్షీణత, అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధర పెరుగుదలకు కారణమని ఆలిండియా సరాఫా ఆసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్పాట్ గోల్డ్ ఔన్స్ 2900 డాలర్లకు చేరుకుంది. ఇక, వెండి ధర కిలోకు రూ.1000 వరకు పెరిగి రూ.97,500కు చేరుకుంది.ట్రంప్ టారిఫ్‌లపై చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మరలుతున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతోంది.