తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతుండడం పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మృత్యువాత పడుతున్నట్టు తేల్చారు. కొన్ని రోజుల పాటు ప్రజలు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించారు. చికెన్ వినియోగం తగ్గించాలని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోతుండడంతో అధికారులు పలు గ్రామాల్లోని కోళ్లఫారంల నుంచి శాంపిల్స్ సేకరించారు. కానూరు గ్రామంలోని కోళ్ల ఫారం నుంచి సేకరించిన శాంపిల్స్ బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. వివరాల కోసం 9542908025 నెంబరుతో ఫోన్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.
![]() |
![]() |