కృష్ణా జిల్లా, గుడివాడ మండలం మల్లాయిపాలెం శివారు టిడ్కో కాలనీలో సమస్యలు పరిష్కరించాలని అధికారులను బీజేపీ టూటౌన్ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ(ఆర్కే) కోరారు. సోమవారం టిడ్కో కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసరావుకు ఆయన వినతిపత్రం అందజేశారు. టిడ్కో కాలనీలో చెత్త, చెదారం పెరిగిపోయిందని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వివరించారు. పందుల సంచరిస్తున్నాయని తెలిపారు. చెత్తసేకరణకు ప్రతి ఇంటికి డస్ట్‌బిన్లను అందించాలని కోరారు. రోజూ ఒక సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి చేస్తున్నారని, అయితే మున్సిపల్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. నాయకులు బోనం గోపిక, దేవరపల్లి చిన్న, లంకా రాంబాబు, రీటా, చరణ్, రాజు, టిడ్కో కాలనీవాసులు పాల్గొన్నారు.
![]() |
![]() |