రాష్ట్ర ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని కూటమి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. గుడివాడ వీకేఆర్ అండ్ వీఎన్‌బీ ఇంజినీరింగ్ కళాశాలలో పట్టభద్రులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి విజయాన్ని చేకూర్చాలని ఆయన కోరారు.
మంచి వ్యక్తిత్వం కలిగిన ఆలపాటికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని, శాసనమండలి ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. మచ్చలేని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించాలని గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కోరారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు పాల్గొన్నారు.
![]() |
![]() |