పాలకొండ పట్టణంలోని మణికంఠ జ్యూయలర్స్ లో మహిళలు చోరికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో నలుగురు మహిళలు షాపులో ప్రవేశించి చెవుల ఆభరణాలు చూపించాలని షాపు యజమాని గుమ్మడి సింధుకుమారిని అడిగారు. మాటల్లో పెట్టి బంగారు వస్తువులను దాచి, వాటి స్థానంలో మెటల్ వస్తువులు పెట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలో గుర్తించిన యజమాని సింధుకుమారి బయటకు వచ్చి పిలుస్తుంటే ఆటోలో కోటదుర్గమ్మ ఆలయం వైపు ఉడాయించారు. దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీ లించారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన బంగారు వస్తువులు పట్టుకుని వా రు ఉడాయించినట్టు షాపు యజమాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |