పవిత్ర పాపాఘ్నినదీ తీరాన వల్లూరు మండల పరిధిలోని పైడికాల్వ గ్రామంలో వెలసిన రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము న సుప్రభాత సేవ, అనంతరం గోపూజ నిర్వహిం చి మంటపారాధన చేశారు. స్వస్తి పుణ్యహవచనం, గణపతిపూజ చేసి ఆచార్యాది రుత్విగ్వరణంలతో పూజలు ప్రారంభించారు. అనంతరం ప్రధాన కలశస్థాపన నిర్వహించి ఇందులో రాజ్యలక్ష్మీసమేత చెన్నకేశవస్వామి స్వరూపాలను ఆదిత్యాదినవగ్రహ దేవతలను, అష్టదిక్ఫాలక పూజలు ఆ కలశాల్లో వేదపండితులు ఆవాహణం చేశారు. తదనంతరం పూజలకు మొట్టమొదటి ఆరాధ్యుడు వి ఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు (అనంతనాగ విజయగణపతి) పూజలను శాసో్త్రక్తంగా నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్టగావించి ముందుగా గణపతి సంబంధించి హోమాలను వివిధ పూజా ద్రవ్యాలతో ఆయనకు ప్రీతికరంగా హోమాలు నిర్వహించిన అనంతరం రుద్ర సహిత, పంచ సూక్తవిధానేనా, ఆదిత్యాది నవగ్రహాలను రుద్రహోమాలు నిర్వహించారు.
![]() |
![]() |