ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. అయితే, బర్డ్‌ఫ్లూపై ఎలాంటి ఆందోళన చెందవద్దని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు తెలిపారు. వలస పక్షుల కారణంగా బర్డ్‌ఫ్లూ సోకి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
బర్డ్‌ఫ్లూ సాధారణంగా ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుందని, కేంద్రం ఆదేశాల మేరకు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామని తెలిపారు. నష్టపోయిన పౌల్ట్రీ రైతులకు పరిహారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
![]() |
![]() |