గుండెపోటు వచ్చిన గంటలోపే ఇవ్వాల్సిన రూ. 40 వేల విలువ చేసే టెనక్టప్లేస్ ఇంజెక్షన్ మాచర్లలో విజయపురిసౌత్ లోని ప్రాజెక్ట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ డా. మహేష్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన పేదల ప్రాణాలు నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థానిక ప్రాజెక్ట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచిందన్నారు. ఈ వైద్య సేవలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
![]() |
![]() |