కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సిడిపిఓ కృష్ణవేణి సందర్శించారు. అంగన్వాడి కేంద్రం నందు ఆధార్ లేని విద్యార్థుల గురించి ఆమె అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల హాజరు పట్టిని, పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు.
![]() |
![]() |