ఖర్జూరాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా చేస్తుంది. ఖర్జూరాలను నీరు లేదా పాలలో నానబెట్టి తినడం మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. పెరుగులో కొన్ని వేసి తింటే రుచికరంగా ఉంటుంది. వీటిని పూరీలు, బిర్యానీ వంటి వంటల్లో కూడా వాడవచ్చు. రోజుకు 2-3 ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మంచిది.
ఎముక ఆరోగ్యం
ఖర్జూరాల్లో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియంతో పాటుగా అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ఖర్జూరాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఖర్జూరాలకు ఉంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కానీ వీటిని ఎక్కువగా తినకూడదు.
గుండె ఆరోగ్యం
ఖర్జూరాలలో ఉండే కెరోటినాయిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఖర్జూరాలు మాక్యులర్ క్షీణత వంటి కంటి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిరూపించబడింది. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ది చెందిన ఫినోలిక్ ఆమ్లాలు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
![]() |
![]() |