ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతనికి బెయిల్‌ మంజూరు చెయ్యడానికి వీల్లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 08:51 AM

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అంటూ వస్తున్న ఆరోపణలలో ఉన్న రెండో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ2 నిందితుడైన ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌కు ఆరోగ్యం బాగాలేదని పేర్కొంటూ బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన 2 ఏడీఎం కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌ కుమార్‌.. ఏపీపీ జయశంకర్‌కు నోటీసులు జారీచేశారు. బెయిల్‌ మంజూరు చేయవద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేసిన ఏపీపీ.. కౌంటర్‌ ఫైల్‌ చేయడానికి నాలుగు రోజులు వ్యవధి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేరకు కోర్టు ఏపీపీకి గడువు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com