శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే శివ దీక్షాపరులకు 19వ తేదీ నుంచి 23 వరకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శక్తి పీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
![]() |
![]() |