మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ఆగస్టులో భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఎడ్జ్ 50 సిరీస్ లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 1.5k సూపర్ HD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ హ్యాండ్‌సెట్ ను రూ.23,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు ఆరు నెలల కాలంలోనే రూ.4,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ జంగిల్ గ్రీన్, పీచ్ ఫజ్ కోలా గ్రే రంగుల్లో లభిస్తోంది.
![]() |
![]() |