నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు సముద్ర తీరాల్లో మంగళవారం మాఘ పౌర్ణమి సందర్భంగా అనేకమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో తీరం సందడి గా మారింది. ఉదయం నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పుణ్య స్నానాలు చేశారు. మరి కొందరు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కుమార స్వామి, ఎస్ఐ సన్నిబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు.
![]() |
![]() |