ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర ప్రారంభమైంది. రూ.5.30కోట్లతో ప్రభుత్వం జాతరకు ఏర్పాట్లు చేసింది. మేడారం వెళ్లే భక్తుల కోసం 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో, వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగు వద్ద జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు గదుల ఏర్పాటు చేశారు.
![]() |
![]() |