'గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్: ఇన్వెస్ట్ కర్ణాటక 2025'కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. అయితే, అక్కడికి వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పట్ల ఆయన సానుభూతి చూపించారు. వీల్‌చైర్‌లో ఉన్న సీఎం.. కేంద్ర మంత్రి రాగానే లేచి నిలబడేందుకు ప్రయత్నించారు. అది గమించిన రాజ్‌నాథ్ వద్దంటూ సీఎంను ఆపారు. ఇటీవలే సీఎం మోకాలికి ఆపరేషన్ జరిగింది. కానీ, ఆయన విశ్రాంతి తీసుకోకుండా వీల్‌చైర్‌లో ఈ మీట్‌కు రావడంపై ప్రశ్నించిన రాజ్‌నాథ్.. సీఎంను ప్రశంసించారు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వీల్‌చైర్‌లో కూర్చొన్న సీఎం చేయి పట్టుకొని మంత్రి కలియతిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.