ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకున్న భారత్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. జేమీ ఒవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ ను తీసుకుంది.ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తోంది. ఇంగ్లీష్ జట్టు మాత్రం ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 6 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో గిల్ (5), కోహ్లీ (5) ఉండగా... భారత్ స్కోరు: 17/1 (4 ఓవర్లు).
![]() |
![]() |