పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ లో బుధవారం మంత్రి సవిత జలహారతి ఇచ్చి నీటిని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొల్లపల్లి రిజర్వాయర్ తెచ్చి కియా పరిశ్రమను తీసుకువచ్చారని తెలిపారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోని రాష్ట్రాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాకే పూర్వ వైభవం వచ్చిందన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |