అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన సమయంలో పేదప్రజల ప్రాణాలకు భరోసానిచ్చే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. పెద్ద ఆసుపత్రుల్లో వేలరూపాయలు ఖర్చు చేస్తే అందించే ఇంజక్షన్‌ను ఉచితంగా అందజేయనున్నారు. అంతేగాక ఈ ఇంజక్షన్‌ను అన్ని సీహెచ్‌సీ, ఏరియూ ప్ర భుత్వ ఆసుపత్రులో 24గంటలూ అందుబాటులో ఉంచారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి తొలిగంట ఎంతో విలువైనది. ఆ సమయంలో రూ.40వేలు విలువ చేసే థ్రాంబోలైసిప్ అనే ఇంజక్షన్‌ను గుండెపోటుకు గురైన వ్యక్తికి అందిస్తే ప్రాణప్రమాదం తప్పిపోయే అవకాశం మెండుగా ఉంటుంది. అందుకే ఈ ఇంజక్షన్‌ను ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచారు. గుండెపోటు కు గురైనపుడు 108కు ఫోన్‌చేసి వివరాలు తెలియచేస్తే సమీప సీహెచ్‌సికి రోగిని తరలించి ఈసీజీ తీసి ఆ వివరాలను నిపుణులైన కార్డియాలజిస్టులకు పంపి వారి సూచనల మేరకు ఇంజక్షన్‌ను ఉచితంగా ఇవ్వటంతోపా టు తక్షణవైద్యసేవలు అందించే నిమిత్తం అన్ని వసతు లున్న ఆసుపత్రికి తరలించి అవసరమైతే సర్జరీకూడా చేయించి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారు. దీ నికోసం చీమకుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రంలో తగిని ఏర్పాట్లు చేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి బెడ్లను, టెస్టింగ్ పరికరాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. సమీప ప్రాంత ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న ఈ అ వకాశాన్ని ఆపద సమయంలో ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
![]() |
![]() |