వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ అంటే భయమని అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తానని జగన్ అంటున్నారన్నారు. మంగళవారం జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. 22,23 తేదీల్లో ఈ నెలలో శాసన సభ్యులకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22వ తేదీన ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్, 23వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబులకు దన్యవాదాలు తెలిపారు.అటెండెన్స్ విషయంలో విప్‌లు పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టాలని నిర్ణయించామన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలోకి రాలేకపోయారని చెప్పారు. అసెంబ్లీకి కూడా జగన్ రాలేదని చెప్పారు. అందుకే ప్రతిపక్ష, అధికార పార్టీ బాధ్యతలు రెండు విజయవంతంగా తామే నిర్వహిస్తామన్నారు. ఇంటిదగ్గర ఉండే ప్రశ్నలు వేస్తానని జగన్ అంటున్నారని...ఇలాంటి విధానం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. సభకు వస్తే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.ప్రతిపక్ష నాయకుడికి ఇంగితం లేదని విమర్శించారు. గతంలో జగన్ టీడీపీ నుంచి ఒకరిద్దరిని వైసీపీలోకి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని అనలేదా అని నిలదీశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పారని. సభకు రాని జగన్‌కు ప్రజలపై బాధ్యత లేదని మండిపడ్డారు.ఎమ్మెల్యేలు తమ ప్రశ్నలు 14వ తేదీలోగా పంపాలని కోరారు. శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జగన్, వైసీపీ నేతలకు ఆత్మాభిమానం లేదని విమర్శించారు. గౌరవ సభ మరింత గౌరవం పెంచేలా సభను నడిపిస్తామని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
![]() |
![]() |