పలాస పట్టణంలోని ఓ వీధిలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలికపై అదే వీధికి చెందిన బి.శివ అనే వ్యక్తి నెలరోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శివపై మంగళవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. నిందితున్ని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa