కడప జిల్లా, వేంపల్లె క్రిస్టియన కాలనీలో కొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీ మండల పరిశీలకులు రఘునాథరెడ్డి, వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ కాలనీకి చెందిన బాబు, రమేష్, సురేష్, గంగరాజు, విజ య్, అశోక్, సురేంద్ర తదితరులు పార్టీలో చేరినట్లు టీడీపీ మండల కన్వీనర్ మునిరెడ్డి, ఎస్సీ సంఘం నాయకులు ఈశ్వరయ్యలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని,ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మండల పరిశీలకులు తెలిపారు. మైనార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్ షబ్బీర్, జగన్నాథరెడ్డి, బాలస్వామిరెడ్డి, నామా వేమకుమార్, యుగంధర్, మల్లికార్జున పాల్గొన్నారు.
![]() |
![]() |