ప్రతి కార్యకర్తకు పెద్దన్నగా తోడుగా ఉంటానని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని, రాబోయేది వైయస్ జగన్ 2.0 పాలనే అని ఉద్ఘాటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇతర స్ధానిక సంస్దల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోబుధవారం వైయస్.జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్.జగన్ దిశానిర్దేశం చేశారు.
![]() |
![]() |