టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నేత కొట్టు సత్యానారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.
![]() |
![]() |