క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణమని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర భూములు తక్కువకు కొనుగోలు చేసాడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని కొట్టేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడారు. రామదాస్ కండ్రిగ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? నాపై సోమిరెడ్డి 17 విజిలెన్స్ ఎంక్వరీ చేయించాడు.. తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం. కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే రామదాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగింది.. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకి కూడా లేదు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. ఈ భూముల విలువల్లో 10 శాతం ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని కాకాణి సవాల్ విసిరారు.
![]() |
![]() |