ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించారని అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని మెయిన్ క్యాంప్‌సలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంఏ ఫైనల్‌లో తమ విద్యార్థులు రిషబ్ ఓత్సాల్ మొదటి ర్యాంకు, ఎల్.వాగ్దేవి 2, ఎం.మోహన్‌కృష్ణ 5వ ర్యాంకులు సాధించారని తెలిపారు. 50 లోపు 14 మంది ర్యాంకులు సాధించారన్నారు. సీఎంఏ ఇంటర్‌లో జి.తనూషారెడ్డి 4వ ర్యాంకు, బి.ఉజ్జిన్నప్ప 10వ ర్యాంకు సాధించారని, 50 లోపు మరో 16 మంది ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులను మాస్టర్‌మైండ్స్ డైరెక్టర్లు అభినందించారు.
![]() |
![]() |