చాలామంది చేపను ఇష్టంగా తింటారు. మరికొందరికి అయితే ఎండు చేపల వాసన అంటేనే పడదు. అయితే పచ్చి చేపలను తినే వారు కూడా ఎండు చేపలను తినడానికి పెద్దగా ఇష్టపడరు.ఎండు చేపలు fish అందరికీ ఒకేలా పని చేయవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి వారు ఎండు చేపలను ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… ఎండు చేపలను అధిక రక్తపోటుతో బాధపడేవారు అసలు తినకూడదు. ఎందుకంటే ఎండు చేపలలో సోడియం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల రక్తపోటును మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటిని తినడం వలన గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలతో బాధపడేవారు రెండు చేపలు తినడం వలన కిడ్నీల వడబోత సామర్థ్యం పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు ఎండు చేపలను తినకపోవడం మంచిది.
షుగర్ సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలకు చాలా దూరంగా ఉండాలి. ఈ సమస్యతో బాధపడేవారు ఎండు చేపలను తినడం వలన రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గుండె సంబంధం సమస్యలు ఏర్పడతాయి. ఇది కొవ్వు సమస్యలను పెంచుతుంది.శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరియు తరచూ దగ్గు , జలుబు , ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎండు చేపలను తినకూడదు. వీటిని తిన్నట్లయితే ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. మరికొందరికి అయితే ఎండు చేపలు తింటే ఎలర్జీ వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఎండు చేపలను సైనస్ , అస్తమా వంటి శ్వాస కోస సమస్యలు ఉన్నవారు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చేపలను తీసుకున్నట్లయితే వారి సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఎండు చేపలను చిన్న పిల్లలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి అనారోగ్య సమస్యకు దారి తీస్తాయి.ముఖ్యంగా ఎండు చేపల్లో తినేటప్పుడు పెరుగు, మజ్జిగ మరియు ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరానికి హాని కలిగిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తలకు నూనె రాసుకుని స్నానం చేసిన రోజు ఎండు చేపలను తినకూడదు. అల్సర్ సమస్యతో బాధపడేవారు ఎండు చేపలను తిన్నట్లయితే ఆ సమస్య మరింత పెరుగుతుంది.
![]() |
![]() |