ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో పౌలీ్ట్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. కోడి గుడ్డు రూ.5.50 నుంచి రూ.3.50కు పడిపోయింది. ఫారం కోడి పది రూపాయలకే లభిస్తోంది. అసలే అంతంతమాత్రంగా వున్న ఫౌల్ర్టీ వీటి ప్రభావాలతో మరింత కుదేలైంది. పోనీలే కొన్ని రోజులు చూద్దామనుకునే పరిస్థితి రైతులకు కనిపించడం లేదు. ఓ వైపు బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ తమ పౌలీ్ట్రలోనూ వస్తుందేమో అని భయంతో వైద్యులు చెప్పిన వ్యాక్సిన్‌లు వాడుతున్నారు. మనుషులను పెట్టి ఫారం చుట్టూ పది కిలోమీటర్ల వరకూ మందులు పిచికారి చేయిస్తున్నారు. ఈ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ తరుణంలో కోడి గుడ్ల, కోళ్లు కాపాడుకోలేక కొన్నిచోట్ల ఒక్కోటి రూ.10కి తెగనమ్ముకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి 15 లక్షల ఫారం కోళ్లు ఉండగా వైరస్ వల్ల 40 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. 75 లక్షల కోళ్లు మాత్రమే మిగిలాయి.కోళ్లకు బర్డ్ ప్ల్యూ సోకిన తణుకు రూరల్ మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ర్టీ పారం నుంచి కిలో మీటరు పరిధిలోని పరిసరాలను అధికారుల పర్యవేక్షణలో శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. వేల్పూరు పరిధిలోని రెడ్ జోన్‌లోని ఐదు పారాల్లో కోళ్లను రాత్రికి రాత్రి వేరే చోటకు తరలించి పారాలను ఖాళీ చే శారు. బర్డ్‌ఫూ నిర్దారణ జరిగిన ఫారం కోళ్లను గురువారం ఖననం చేయనున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ కెశంకర్ బావనారాయణ తెలిపారు.
![]() |
![]() |