గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేట్రేగిపోయారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని రవీంద్ర అన్నారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టి, నోరుంది కదా అని బూతులు తిట్టాడని మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించాడని ఇంకో నాయకుడు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాడనిఇలాంటి చర్యలను ఉపేక్షించాలా అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
![]() |
![]() |