ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ ఛాంపియన్ గా కర్ణాటక, రన్నర్ గా కేరళ జట్లు నిలిచాయి. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్,
అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 నుండి 13 వరకు గడిచిన నాలుగు రోజులుగా మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల జట్ల మధ్య క్రికెట్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. టోర్నమెంట్ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కర్ణాటక జట్టు అంతిమంగా ఛాంపియన్ గా నిలిచింది.
![]() |
![]() |