తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలు లక్ష్మీరెడ్డి ఫిర్యాదుతో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను నమ్మించి మాయమాటలు చెప్పి మోసం చేశాడని, చంపేస్తానంటూ బెదిరించాడని లక్ష్మీరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.నమ్మించి మాయమాటలు చెప్పడమే కాకుండా, తనను చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని లక్ష్మిరెడ్డి తెలిపారు.ఈ మేరకు క్రైమ్ నెం. 22/2025 కింద 420, 417, 506 ఐపీసీ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు బుక్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే, తిరుపతి జనసేన ఇంఛార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్‌పై కేసు నమోదు అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
![]() |
![]() |