ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంత టీడీపీలో టికెట్ల పంచాయితీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 12:30 AM

అనుకున్న‌ట్టే అనంత‌పురం జిల్లాలో టీడీపీ టికెట్ల కేటా యింపునకు సంబంధించి అధినేత చంద్రబాబు నిర్వహించనున్న సమీక్షకు కౌంట్‌డౌన్‌ ప్రారం భమయింది. జిల్లాకు చెందిన సిట్టింగులతోపాటు పార్టీ ముఖ్య నాయకులు బుధవారం ఆ యన ఎదుట హాజరుకానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లా నేతలతో బుధవా ్డరం ఆయన సమావేశం కానున్నారు. ఇందుకోసం జిల్లా నేతలంతా అమరావతికి పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని ముఖ్యమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో జిల్లా సమీక్షకు కూడా ముహూర్తం (బుధవారం) ఖరారు చేశారు. దీంతో జి ల్లాలోని సిట్టింగుల్లో టెన్షన్‌ మొదలైంది. సీఎం చంద్రబాబు వద్ద జిల్లాకు చెందిన అందరు నేతల జాతకాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి ఆధారంగానే ఎమ్మెల్యేలకు ర్యాంకులు కూడా ప్రకటించారు. అదే సమయంలో పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ వెనుకబడిన వారిని చంద్రబాబు సుతిమెత్తగా హెచ్చరించారు.


అంతేకాదు.. వర్గపోరుతో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు త మ పంచాయితీలు సీఎం వద్దకు చేరేలా ప్రవర్తించారు. వాటన్నింటినీ టికెట్ల ఖరారు సమ యంలో అధినేత ఎక్కడ తమ ముందు ప్రస్తావిస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నా రు. ఎన్నోసార్లు హెచ్చరించినా తీరుమార్చుకోని నేతలు ఇప్పుడు తమ పరిస్థితి ఏమవుతుందోనని టెన్షన్‌ పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ముఖ్యమంత్రి 36 సార్లు పర్యటించారు. ప్రతిసారీ జిల్లాకు వరాలు కురిపిస్తూ వచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆయన పదేపదే సూచించారు. దీన్ని జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలినవారంతా తేలిగ్గా తీసుకున్నారు. ఎక్కడికక్కడ వర్గపోరు కొనసాగిస్తూ వచ్చారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏర్పడిన గ్రూపులకు అదే పార్టీకి చెందిన కొందరు ప్రముఖ నేతలు అండదండలందిస్తున్నారంటూ సీట్టింగులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ల ఖరారు సమీక్షకు హాజరవుతున్న జిల్లా నేతలు తమకు అభ్యర్థిత్వం ఖరారవుతుందా..? లేదా..? అనే విషయమై తమతమ సన్నిహితులతో చర్చిస్తున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాలోని ఐదు నియోజకవర్గాలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించి అక్కడి సిట్టింగుల లోపాలపై హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగే సమీక్షల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa