2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు దుబాయ్ పర్యటనకు బయలుదేరింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ ని ఫిబ్రవరి 20న ఆడబోతుంది. ఈ నేపథ్యంలో నేడు ముంబై విమానాశ్రయం నుండి భారత ఆటగాళ్లు పయనమై వెళ్లారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సహా ఈ టోర్నీకి ఎంపికైన జట్టు సభ్యులు అందరూ దుబాయ్ కి పయనమయ్యారు. ఈ టోర్నమెంట్ దాదాపు 3 వారాలపాటు కొనసాగనుంది. దీంతో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. కొత్త విధానం ప్రకారం 45 రోజులకు మించిన టోర్నీలో మాత్రమే కుటుంబ సభ్యులు గరిష్టంగా రెండు వారాలపాటు జట్టుతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కాకుండా సింగిల్ గానే దుబాయ్ కి పయనమయ్యారు. భారత్ ఫిబ్రవరి 20న మొదట బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఆ తర్వాత 23న దాయాది పాకిస్తాన్ తో తలపడుతుంది. ఇక మార్చ్ 1 న కివీస్ తో రోహిత్ సేన తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది.
ALL THE BEST, TEAM INDIA FOR CHAMPIONS TROPHY. pic.twitter.com/DJwqY9w3jN
— Johns. (@CricCrazyJohns) February 15, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa