తాజాగా మహేంద్ర సింగ్ ధోని కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో మహేంద్ర సింగ్ గుర్తుపట్టని విధంగా కనిపించారు. తన భార్యతో కలిసి ప్రైవేట్ ఈవెంట్ కు వెళ్లారు మహేంద్ర సింగ్ ధోని. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న మహేంద్రసింగ్ ధోని దంపతులు ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వాలెంటెన్స్ డే నేపథ్యంలోనే ఈ ప్రైవేట్ ఈవెంట్ కు మహేంద్ర సింగ్ ధోని దంపతులు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా వైరల్ అయిన ఫోటోలలో అసలు మహేంద్రసింగ్ ధోనిని గుర్తుపట్టారని విధంగా కనిపించారు. క్లీన్ షేవ్ చేసుకున్న ధోని తన ముఖంలో ఏదో మార్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలు చూసిన మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి సాక్షి ధోని పక్కన.. ఉన్న వ్యక్తి మహేంద్రసింగ్ ధోని నా ? రియల్ ధోనియా..? లేక డూప్ ధోనియా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఇలా కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మహేంద్ర సింగ్ ధోని సర్జరీ చేయించుకున్నాడని కూడా అంటున్నారు. ఇటీవల విదేశాలకు వెళ్లి తన ఫేస్ సర్జరీ చేయించుకొని మహేంద్ర సింగ్ ధోని వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆ ఫోటోలు చూసిన నేటిజన్స్ అలాగే ధోని ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోని ఫోటోలు వైరల్ కావడంతో ట్విట్టర్ లో ధోని పేరు ట్రెండ్ అవుతుంది.
![]() |
![]() |