హైదరాబాద్: ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ముగిసింది. అక్కడ సుమారు మూడు నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా దిగ్విజయంగా నిర్వహించడంలో పారిశుద్ధ(సఫాయి) కార్మికులు కీలక పాత్ర పోషించారు. ఆ కార్మికుల సేవలను గుర్తించిన ప్రధాని మోదీ.. సఫాయి కార్మికుల కార్పస్ ఫండ్‌కు 21 లక్షలు విరాళం ప్రకటించారు. తన పర్సనల్ సేవింగ్ అకౌంట్ నుంచి ప్రధాని మోదీ ఆ మొత్తాన్ని కార్పస్ ఫండ్‌ను డొనేట్ చేశారు. కుంభమేళాను అద్భుతంగా నిర్వహించిన యూపీ ప్రభుత్వాన్ని కూడా మోదీ మెచ్చుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మేళా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa