బెట్టింగ్ అంతా మొబైల్‌యాప్‌ల ద్వారానే జరుగుతుండడంతో ఆయా యాప్‌లను గుర్తించి, వాటిని విశాఖ నగరంలో డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారిని పట్టుకోగలిగితే లక్ష్యం చేరవచ్చని సీపీ భావిస్తున్నారు. ఇందుకోసం నగర పరిధిలోని ఇంటర్నెట్ వినియోగించే సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్, లాప్‌టాప్‌ల ఐపీ నంబర్లు ఆధారంగా గూగుల్‌ప్లేస్టోర్‌లో బెట్టింగ్‌యాప్‌లను బ్రౌజింగ్‌చేసే వారిని గుర్తించడంపై దృష్టిపెట్టారు. అలా గుర్తించేందుకు అవకాశం ఉందా? లేదా? అనేదానిపై కొంతమంది సాంకేతిక నిపుణులు, వెబ్‌సైట్ల డిజైనర్లతో సీపీ ప్రాథమికంగా చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఇన్‌స్టెంట్ లోన్ పేరుతో భారీస్థాయిలో మోసాలు జరుగుతుండడంతో వాటిపైనా సీపీ దృష్టిపెట్టారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇన్‌స్టెంట్ లోన్ తీసుకోవాలంటే మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్‌చేసుకోవాల్సిందే. కాబట్టి అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌చేసేవారిని గుర్తించాలని సీపీ సాంకేతిక నిపుణుల వద్ద అభిప్రాయపడినట్టు పేర్కొంటున్నారు. ఒకవేళ బెట్టింగ్, లోన్‌యాప్‌ల డౌన్‌లోడ్‌లను ఐపీ నంబర్ల ఆధారంగా గుర్తించే అవకాశం ఉంటే నగరంలో బెట్టింగ్, లోన్‌యాప్‌ల ఆగడాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడడం ఖాయమని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |