జయవాడ కోర్టులో సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసుల పిటిషన్‌పై విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు వంశీని కస్టడీకి కోరనున్నారు. పది రోజులు కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఇవాళ కోర్టుకు హాజరై సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.అయితే, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వల్లభనేని వంశీకి 14 రోజలు పాటు రిమాండ్ విధించింది విజయవాడలోని అదనపు కోర్టు. దీంతో ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేసులో కీలకంగా మారిన వంశీ ఫోన్ తో పాటు మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
![]() |
![]() |