గజ్వేల్ పట్టణంలోని గ్యారా షహీద్ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుoది. కుల మతాలకతీతంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సమీప జిల్లాల ప్రజలు ఈ దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పురాతన కాలంలో కరువు కాటకాదులతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతూ భయంకరమైన రోగాలు ప్రబలగా, గ్యారా షహీద్ దర్గాలో ప్రార్థనల అనంతరం పరిస్థితి చక్కబడి పాడి పంటలు సమృద్ధిగా పండినట్లు ప్రచారంలో ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ముత్తవల్లిల ఆధ్వర్యంలో ప్రతి ఏటా రెండు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
శని, ఆదివారం గ్యారా షహీద్ దర్గాకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరాగా, గంధం, మిఠాయి, కొబ్బరికాయలు దర్గాలో సమర్పించి పాఠ్యహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతీన్, నాయకులు సాజిద్ బేగ్, సమీర్, రాములు గౌడ్, డాక్టర్ వహీద్, అజ్గర్, రమేష్ గౌడ్, గుంటుకు శ్రీను, అంజద్, శివారెడ్డి, నరసింహారెడ్డి, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, డప్పు గణేష్, కోడాకండ్ల బాలు, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |