ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తీశ్వరునికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 06:36 PM

శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు ఆలయ ఈవో శ్రీరామస్వామి, అర్చకబృందం కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను టిటిడి ఈవోకు అందించారు. శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 27న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 11వ తేదీ వరకు జరుగనున్నాయి.  ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీనివాసుడి సోదరి అయిన భ్రమరాంబ సౌభాగ్యం కోసం శ్రీవారు పట్టువస్త్రాలు పంపుతున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa